ఈ పుట్టిన రోజు మాత్రం కన్నుల పండుగే..!

Published on Aug 21, 2019 4:25 pm IST

కొణిదెల శివ శంకర ప్రసాద్ గా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యి “మెగాస్టార్ చిరంజీవి”గా మారి కోట్లాది మంది అభిమానులతో “అన్నయ్య” అని పిలిపించుకొని ఆరాధించే స్థాయికి “స్వయంకృషి”తో ఎదిగి తెలుగు సినీ పరిశ్రమలో ఒక మహా అధ్యాయంలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.ఇవన్నీ పక్కన పెడితే ఆయన తెర మీద కనబడితే చాలు చొక్కాలు చించుకునే అభిమానులు మాత్రమే కాకుండా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసే అభిమానులు కూడా గుర్తుకు వస్తారు.అలా మెగాస్టార్ వారిని ప్రభావితం చేసారు.

ఇప్పుడు ఆ అభిమానులు అందరికి ఈసారి జరగబోయే పుట్టిన రోజు వేడుకలు కన్నుల పండుగలా నిలిపోయేలా జరగబోతున్నట్టు తెలుస్తుంది.ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఒక్క రోజు ముందే అంటే ఆగష్టు 21 ఈరోజున శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఆయన నటించిన “సైరా నరసింహా రెడ్డి” టీజర్ చూసి చెప్పుకోలేని ఆనందాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తుండగా బాస్ పుట్టిన రోజు వేడుకలు రావడం ఈ వేడుకలకు సైరా కోసం రాజకీయాల్లో బిజీగా ఉన్న తన సోదరుడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వంటివి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించాయి.

ఈ ఆనందనాన్ని మరింత రెట్టింపు అవ్వడం ఈరోజు ఖాయం అనే చెప్పాలి.ఎందుకంటే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ సహా మొత్తం మెగా కుటుంబం అంతా హాజరు కానున్నారు.ఇలా మెగా కుటుంబం అంతటిని ఒకే వేదికపై చూసి చాలా కాలం అయ్యింది.63 నుంచి 64కు అడుగుపెట్టబోతున్న ఈ పుట్టిన రోజు వేడుకలు మాత్రం మెగాభిమానులకు ఐఫీస్ట్ గా నిలవడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :