ఈసారి అంత ఇంపాక్ట్ చూపించని ‘హను మాన్’

ఈసారి అంత ఇంపాక్ట్ చూపించని ‘హను మాన్’

Published on Jun 26, 2026 7:03 PM IST

ఈ మధ్య కొన్నేళ్లలో తెలుగు సినిమా అందుకున్న సంచలన విజయ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ సినిమా హను మాన్ కూడా ఒకటి. టాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ఇది కాగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డ్ గ్రాసర్ గా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా భారీ లాంగ్ రన్ ని అప్పట్లో చూసినప్పటికీ ఇప్పుడు మాత్రం సినిమా డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. లేటెస్ట్ గానే 3డి వెర్షన్ లో హను మాన్ విడుదల కాగా మినిమం రెస్పాన్స్ ఈ సినిమాకి కనిపించండం లేదు. హైదరాబాద్ లాంటి కొన్ని సిటీ లలో కేవలం ఒకటీ రెండు మల్టీప్లెక్స్ లలో తప్ప మిగతా చోట్ల బుకింగ్స్ దాదాపు శూన్యం. సో రీరిలీజ్ లో మాత్రం హను మాన్ మిస్ ఫైర్ అయ్యిందని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు