త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ లుక్ సరికొత్తగా..!

Published on Mar 15, 2020 8:33 pm IST

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈసారి ఎన్టీఆర్ కోసం సరికొత్త కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారట. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉంటుందని కొందరు అంటుంటే కొందరు అల వైకుంఠపురంలో మాదిరి మంచి హ్యూమర్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు.

ఇక ఎన్టీఆర్ లుక్ పై కూడా త్రివిక్రమ్ తీవ్ర శ్రద్ద తీసుకుంటున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేయనున్నాడని తెలుస్తున్న సమాచారం. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More