ఈసారి నేషనల్ లెవెల్ ఫీట్ అందుకున్న రౌడీ హీరో.!

Published on Jun 4, 2021 4:00 pm IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో దేవరకొండ ఈ మధ్యనే టైం జాబితా నుంచి వచ్చిన హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్ట్ లో ఫస్ట్ స్థానంలో నిలిచినా సంగతి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఈ రౌడీ హీరో ఇపుడు పాన్ ఇండియన్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు. మరి ఈ తరుణంలో అంతకు మించి ఇండియన్ వైడ్ మరోమారు విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుంది.

మొన్న హైదరాబాద్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలవగా ఇపుడు విజయ్ ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో నెంబర్ 2 స్థానంలో చోటు దక్కించుకుని ఆశ్చర్యపరిచాడు. దీనితో మరో మారు విజయ్ పేరు నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది. మరి ప్రస్తుతం పూరి తో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “లైగర్” తర్వాత విజయ్ దేవర కొండా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :