“RRR” లో ఆ భీకర ఇరవై నిమిషాలు.?

“RRR” లో ఆ భీకర ఇరవై నిమిషాలు.?

Published on May 7, 2021 7:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సాలిడ్ మాస్ పర్సనాలిటీస్ తో దర్శక ధీరుడు రాజమౌళి లాంటి దర్శకుడు ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ హై నే ఇంకో స్థాయిలో ఉంటుంది. మరి అలాంటి ఈ సెన్సేషనల్ కాంబో ఎలా ఉంటుంది ఇద్దరు సమ ఉజ్జి పాత్రలను ఎలా తెరకెక్కిస్తారు అన్న ప్రశ్న చాలా కాలంగా అందరి మదిలోనూ అలా మెదులుతూనే ఉన్నాయి.

అల్లూరిగా రామ్ చరణ్ గొండు బెబ్బులి కొమురం భీం గా తారక్ కనిపించే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ 20 నిమిషాలు వెండితెరపై పండుగలా ఉంటుందట. ఆ ఇరవై నిమిషాల భీకర పోరాట సన్నివేశంతోనే రాజమౌళి ఇద్దరు అగ్ర హీరోలను కలుపుతాడని మరో టాక్ ఉంది. అందుకే ఈ కీలక సన్నివేశం ఈ చిత్రంలో మరో ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రంలో మరింత మంది అగ్ర నటులు నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య 400 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు