“ఆదిపురుష్” నుంచి ఆల్ మోస్ట్ అప్పటికి ఫిక్స్.?

Published on Mar 30, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన బై లాంగువల్ మైథలాజికల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ చిత్రం విడుదలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మాత్రం అనన్య సామాన్యం.

పైగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం అవి మరింత ఎక్కువవుతున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఒక స్పెషల్ అప్డేట్ వచ్చే శ్రీరామ నవమి సందర్భంగా ఉంటుంది అని అప్పుడు మాట్లాడుకున్నాం.. మరి అది ఏంటా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. ఆ శుభ దినాన రామునిగా ప్రభాస్ అవుట్ స్టాండింగ్ లుక్ నే విట్నెస్ చెయ్యనున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఆల్ మోస్ట్ అప్పటికి ఫిక్స్ అని స్ట్రాంగ్ గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే వచ్చే ఏప్రిల్ 21 వరకు ఆగాల్సిందే. ఇక ఈ భారీ ఇతిహాస చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :