ఈ కంటెస్టెంట్ ను హోల్డ్ లో ఉంచడానికి కారణం ఇదేనా.?

Published on Nov 22, 2020 7:57 pm IST

ఈసారి జరుగుతున్న తెలుగు స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్ సీజన్ 4” మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇంకా మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరికీ సెపరేట్ అభిమానులు, ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అయితే ఇప్పటి వరకు మిగిలి ఉన్న వారిలో ఓ కంటెస్టెంట్ ను మాత్రం ఇంకా ఎందుకు ఉంచుతున్నారా అన్నది ఎవరికీ అర్ధం కాకుండా పోతుంది. ఆమెనే మోనాల్ గజ్జర్.

అసలు ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ ఈమెనే అని ఇప్పటికీ షో ఫాలోవర్స్ అంటుంటారు. అలాంటిది ఇంకా ఈమె ఎలిమినేషన్ కు ఎందుకు దాట వేస్తున్నారా అని అంతా అనుకుంటున్నారు.అలాగే ఈసారి ఎలిమినేషన్ లో కూడా ఈమెను తప్పించి లాస్యను చేశారన్న టాక్ కూడా బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు దీనికి కారణం ఏమిటా అన్నది తెలుస్తుంది.

బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ కు మరియు మోనాల్ కు మధ్య ఉన్న కెమిస్ట్రీ మూలాన మాత్రమే హౌస్ లో ఉంచుతున్నారని తెలుస్తుంది. మేకర్స్ వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కు వస్తున్న రెస్పాన్స్ దృష్ట్యా వీరిలా చేస్తున్నారట.అలాగే లాస్య కంటే ఇప్పుడు కాస్త బెటర్ వోటింగ్ రావడంతో ఆమెను ఉంచడానికి మరో కారణం అన్నట్టు తెలుస్తుంది.మొత్తానికి మాత్రం ఈ విషయంలో మాత్రం ఆడియెన్స్ బిగ్ బాస్ మేకర్స్ పై కాస్త అసహనం గానే మొదటి నుంచి ఉన్నారు. మరి ఫైనల్ గా ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More