ఈ వారం రానున్న ఓటీటీ సినిమాలు ఇవే !

Published on Jun 28, 2021 3:44 pm IST

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఎంట్రీ ఇవ్వనున్న సినిమాల గురించి, వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం. ముందుగా ‘కోల్డ్‌ కేస్‌’ సినిమా. తను బాలక్‌ దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 30న రిలీజ్‌ కానుంది. అలాగే హసీన్‌ దిల్‌రుబా సినిమా. వినిల్‌ మాథ్యూ డైరెక్షన్‌ లో తాప్సీ పన్ను, విక్రాంత్‌ మాస్సే, హర్షవర్ధన్‌ రానే ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ లో జూలై 2న ఈ సినిమా విడుదల కానుంది.

అదే విధంగా ‘ద టుమారో వార్‌’ సినిమా. క్రిస్‌ మెకే దర్శకత్వంలో క్రిస్‌ ప్రాట్‌, వోనె స్ట్రాహోవ్‌స్కీ, జేకే సిమ్మన్స్‌, బెట్టీ గిల్పిన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది. సమంతార్‌ సీజన్‌ 2 సిరీస్, సతీష్‌ రాజ్వడే దర్శకత్వంలో తేజస్విని పండిట్‌, సాయి టామ్‌హంకర్‌, స్వాప్నిల్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ జూలై 2 నుంచి ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోకి అందుబాటులోకి రానుంది.

ఎలెన్‌ పాంపియో, చంద్ర విల్‌సన్‌, జేమ్స్‌ పికెన్స్‌ నటించిన వెబ్‌సిరీస్‌ గ్రేస్‌ అనాటమీ. ఈ సిరీస్‌ 17వ సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది. వరుణ్‌ శర్మ, మంజోత్‌ సింగ్‌, ఎల్నాజ్‌ నోరోజి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ చుట్జ్‌పా. ఈ సిరీస్‌ సోనీ లైవ్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :