“RRR” లో అజయ్ రోల్ ఉండేది అప్పుడేనా.?

Ajay Devgn

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంలో ఒక్క తారక్ చరణ్ లు మాత్రమే కాకుండా బాలీవుడ్ కి చెందిన స్టార్ నటులు ఆలియా భట్ మరియు స్టార్ హీరో అజయ్ దేవగన్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే అజయ్ చేస్తున్న పవర్ ఫుల్ రోల్ ను మేకర్స్ ఇటీవల విడుదల చెయ్యగా దానికి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. మరి అజయ్ రోల్ ఎప్పుడు ఉంటుంది అన్న దానిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. రాజమౌళి అన్ని సినిమాల్లో ఉన్నట్టుగానే ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట అక్కడ అజయ్ రోల్ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ టాక్ లో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే.

Exit mobile version