మెగాస్టార్ సినిమాపై అందుకే దాచారా.?

మెగాస్టార్ సినిమాపై అందుకే దాచారా.?

Published on Aug 19, 2020 8:02 AM IST

chiru

ప్రస్తుతం మెగాస్టార్ చిరు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సైరా లాంటి భారీ పీరియాడిక్ డ్రామా తర్వాత అందులోను కొరటాలతో మొదలు పెట్టిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కోసం ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా ఈ ఆగష్టు 22న చిరు పుట్టినరోజు కావడంతో ఆరోజు విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఐతే ఇక్కడే చిరు 152 వ చిత్రం అని హైలైట్ చేసారు తప్ప అందరికీ తెలిసిన టైటిల్ ఆచార్య అని ఎక్కడా తెలుపలేదు. అయితే ఈ విషయంలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. టైటిల్ తెలిసిందే కానీ ముందే చెప్పేస్తే ఎలా? లేదా ఆరోజు మరో టైటిల్ తో ఏమన్నా అనౌన్స్ చేస్తారా అన్నది చూడాలి. ఆచార్య అనే టైటిలే కన్ఫర్మ్ అని తెలిసిందే. ఏదైనా అధికారికంగా వచ్చే వరకు మనం వెయిట్ చెయ్యాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు