దర్శకునిగా తనకి మరో లెవెల్ క్రేజ్ ని తీసుకొచ్చిన సినిమా బాహుబలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన దగ్గర ఉన్నందంతా పెట్టి చేసిన ఈ సినిమా కోసం ఇప్పుడు మరోసారి నేషన్ మాట్లాడుకుంటుంది. అలానే మేకర్స్ బాహుబలి ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపజేసేలా చేసిన యానిమేషన్ ప్రాజెక్ట్ గా బాహుబలి ఎటర్నల్ వార్ ని ప్రపంచ స్థాయి యానిమేషన్ సినిమాల తరహాలో ప్రెజెంట్ చేస్తూ వదిలిన టీజర్ భారీ హైప్ సెట్ చేసింది.
అయితే అసలు దీనిని కూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించి ఉంటే బాగుండేది అని చాలామంది భావించారు. కానీ అసలు ఈ సినిమా ఎందుకు తను చేయడం లేదు అనేది రివీల్ చేశారు. దర్శకుడు ఇషాన్ శుక్లా సినిమాలోని ఎమోషన్స్ ని పాత్రలను బాగా అర్థం చేసుకున్నాడని అందుకే తను తప్పుకున్నట్టు రాజమౌళి రివీల్ చేశారు.
అంతేకాకుండా బాహుబలి అనే ప్రపంచం ఎంతో కలర్ ఫుల్ గా భారతీయ సంస్కృతిలో ప్రతిబింబించేలా కనిపిస్తుంది. దీనిని పూర్తి స్థాయిలో నిజ జీవిత సినిమాలో ప్రెజెంట్ చేయడం కొంచెం కష్టతరమైన పని కానీ యానిమేషన్ లో దీనిని బాగా చూపించవచ్చు. అందుకే తాము ఈ దారి ఎంచుకున్నట్టు రివీల్ చేశారు. సో ఇలా బాహుబలి యానిమేషన్ సినిమాకి మరో దర్శకుడు వర్క్ చేయడం సాధ్యపడింది.


