మాస్ మహారాజ్ క్రేజీ ప్రాజెక్ట్ కి అప్పుడే ఈ పనులు.!

Published on Jun 16, 2021 5:00 pm IST

తన లేటెస్ట్ చిత్రం “క్రాక్” తో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ దాని తర్వాత దర్శకుడు రమేష్ వర్మతో “ఖిలాడి” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ను స్టార్ట్ చేసేసి ఆల్ మోస్ట్ ముగించేయనున్నారు. అయితే రవితేజ ఈ సినిమా తర్వాత చెయ్యబోయే చిత్రాల్లో నూతన దర్శకుడు శరత్ మండవ తో ప్లాన్ చేసిన సాలిడ్ ఎంటెర్టైనెర్ కూడా ఉంది.

మరి దీనిపైనే పలు ఆసక్తికర అంశాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. మరి వాటి ప్రకారం ఈ చిత్రానికి ఆల్రెడీ మ్యూజికల్ పనులు కంప్లీట్ అయ్యిపోయాయట మొత్తం నాలుగు సూపర్బ్ సాంగ్స్ ను సామ్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈ మ్యూజికల్ సిట్టింగ్స్ లో రవితేజ కూడా పాల్గొన్నారట. వీటితో పాటుగా మళ్ళీ మాస్ మహారాజ్ నుంచి వింటేజ్ ట్రీట్ ను కూడా దర్శకుడు సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :