“వకీల్ సాబ్”కు శరవేగంగా ఈ పనులు.!

Published on Mar 15, 2021 9:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలా కాలం అనంతరం తెలుగు సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి విడుదల ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే ఉన్నా చిత్ర యూనిట్ నుంచి ఇంకా సరైన ప్రమోషన్స్ జరగడం లేదని టాక్ కూడా ఉంది.

అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ మరో పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న థమన్ ప్రస్తుతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే మరో అప్డేట్ ను కూడా రివీల్ చేసాడు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మెలోడియస్ థర్డ్ సింగిల్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసాడు. మరి ఇది కూడా దాదాపు ఈ రెండు మూడు రోజుల్లోనే వచ్చేయడం కన్ఫర్మ్..

సంబంధిత సమాచారం :