“రాధే శ్యామ్” కు సైలెంట్ గా ఈ పనులు జరుగుతున్నాయా?

Published on Feb 3, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే కొంత మేర ప్యాచ్ వర్క్ ముగించుకుంటున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ పనులు సైలెంట్ గా జరిగిపోతున్నాయట. పలు ఏరియాల్లో ఇప్పటికే మంచి ఫ్యాన్సీ రేట్లకే థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతున్నాయట.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓవరాల్ గా ఎంతకు అమ్ముడుపోయిందో తెలియాలి అంటే ఇంకా కొన్నాళ్ళు వేచి చూడాలి. మరి ఈ భారీ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వాయు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :

More