ఈ ఏడాది సౌత్ లో విడుదలకానున్న బయోపిక్స్ !

ఈ ఏడాది సౌత్ లో విడుదలకానున్న బయోపిక్స్ !

Published on Jan 7, 2019 11:35 AM IST

ఇంతకుముందు బయోపిక్ అంటే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ సౌత్ ఇండస్ట్రీ లోకూడా మొదలైయింది. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన మహానటి చిత్రం బయోపిక్ సినిమాలో ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఇక అప్పటినుండి మేకర్స్ బయోపిక్ సినిమాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ ఏడాది సౌత్ లో ఏకంగా 7 బయోపిక్ సినిమాలు విడుదలకానున్నాయని సమాచారం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ బయోపిక్ :

లెజండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ ఈనెల 9న విడుదలకానుంది. రెండవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదలకానుంది.

మణికర్ణిక :

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక’. ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈనెల 25న ఈచిత్రం విడుదలకానుంది.

యాత్ర :

దివగంత నేత , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రం ఫిబ్రవరి 8న విడుదలకానుంది.

మరియప్పన్ :

ఇండియన్ పారాలింపిక్ హై జంపర్ మరియప్పన్ తంగవేలు జీవిత కథ తో తెరకెక్కుతున్న చిత్రం ‘మరియప్పన్’. తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ధనుష్ సతీమణి ఐశ్వర్య ధనుష్ డైరెక్ట్ చేస్తుంది. ఈచిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సైరా :

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలకానుంది.

తిరుణాల్ మార్తాండ వర్మ : ది కింగ్ అఫ్ ట్రావెన్ కోర్

మలయాళ భాషలో హిస్టారికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రంతో రానా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కె మధు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుందని సమాచారం.

సుకుమార కురుప్పు :

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రం కేరళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు