మిలియన్ డాలర్ మార్కుకు అతి చేరువలో ‘తొలిప్రేమ’ !
Published on Feb 20, 2018 11:51 am IST

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్లో మరొక సాలిడ్ హిట్ గా నిలిచిన చిత్రం ‘తొలిప్రేమ’. మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో రూ.14.03 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.18.33 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

మొదటి నాలుగు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రం రెండవ వారంలో కూడా అదే స్థాయి రన్ ను చూపించి గత శుక్రవారం 39 వేల డాలర్లు, శనివారం 68.6 వేల డాలర్లు, ఆదివారం 53 వేల డాలర్లు వసూలు చేసి ఇప్పటి వరకు 9.44 లక్షల డాలర్లకు చేరుకుని ఇంకో రెండు రోజుల్లో మిలియన్ డాలర్ క్లబ్లో చేరనుంది. నూతన దర్శకుడు వెంకీ అంట్లూరి డైలెక్ట్ చేసిన ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook