సైరా అయినా కూడా వాళ్లిద్దరూ అందుకు ససేమిరా.

Published on Sep 22, 2019 3:00 am IST

సైరా’ విడుద‌ల‌కు ఇంకా కేవలం పదిరోజుల వ్యవధి మాత్రమే ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ సామజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ప్రచార జోరు పెంచే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం ఆ వైపుగా ద్రుష్టి సారించింది.కాగా ఆదివారం హైదరాబాద్ వేదికగా ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు చెన్నై, బెంగ‌ళూరు, కొచ్చిల‌లోనూ కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.

కాగా వీటిలో ఒక్క‌దానికైనా బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని, అలాగే నయనతారను తీసుకురావాల‌ని సైరా టీమ్ భావించింది. అయితే.. బిగ్ బీ మాత్రం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. అమితాబ్ అనారోగ్య కారణాలు చూపిస్తూ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం సైరా టీం కి తలనొప్పిగా మారింది. ముంబై వేదికగా జరిగిన టీజర్ కార్యక్రమంలో కూడా అమితాబ్ కనిపించలేదు. ఐతే ప్ర‌మోష‌న్ల‌కు రాను అని అమితాబ్‌బ‌చ్చ‌న్ ముందే సైరా బృందానికి చెప్పిన‌ట్టు టాక్‌.

ఇక న‌య‌న‌తార సంగ‌తి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె గత కొన్నేళ్లుగా ఆ పాలసీకి కట్టుబడి ఉంటుంది. సినిమా ఏదైనా, స్టార్ ఎవరైనా ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ఉంటుంది. సైరా కైనా ఆమెను తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావించింది కానీ.., అది అంత సులభం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల చెన్నై వేదికగా స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం బిగిల్ ఆడియో వేడుకకు కూడా ఆమె హాజరుకాలేదు. దీనిని బట్టి సైరా వేడుకకు ఆమె వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More