బాలయ్య నుంచి ఆ రెండు సాలిడ్ అప్డేట్స్ కూడా.?

Published on Jun 4, 2021 12:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం “అఖండ”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ హ్యాట్రిక్ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొన్ని రోజులు కితమే ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ రావాల్సి ఉంది కానీ అది కాస్తా వాయిదా పడింది.

మరి దీనిని పక్కన పెడితే వచ్చే బాలయ్య పుట్టినరోజున తాను నెక్స్ట్ చెయ్యబోయే రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ పై అధికారిక అప్డేట్స్ రావడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇప్పటికే హిట్ దర్శకులు గోపీచంద్ మలినేని మరియు అనీల్ రావిపూడిల స్క్రిప్రులకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మరి వాటిపైనే అధికారిక ప్రకటన ఆరోజు రావొచ్చని తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా అఖండ నుంచి కూడా ఏదైనా సాలిడ్ ట్రీట్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :