చిరంజీవి 150వ సినిమా కోసం భారీ సెట్టింగ్

chiru
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటినీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేస్తున్నారు చిత్ర టీమ్. ప్రస్తుతం ‘సింగప్ప కొండ’ గ్రామంలో రెండవ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో మూడవ షెడ్యూల్ మొదలుపెట్టనుంది.

ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోని ‘నానక్ రామ్ గూడలో’ జరగనుంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే పూర్తిచేయనున్నారు. అందుకోసం భారీ సెట్టింగ్ ను కూడా వేస్తున్నారు. ఈ సెట్టింగ్ మొత్తం ప్రముఖ కళా దర్శకుడు ‘తోట తరణి’ గారి సారథ్యంలో రూపుదిద్దుకొంటోంది. సాధారణ సినిమాలకే తన కళా నైపుణ్యంతో మంచి అందం తీసుకొచ్చే తోట తరణి చిరు 150 వ సినిమా సెట్టింగ్ కోసం ప్రత్యేక శ్రద్ద పెట్టి సినిమా మొత్తానికి ఈ సెట్టింగ్ హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే వివి. వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ కాగా రామ్ చరణ్ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.