ఈ సంక్రాంతి (Sankranthi) కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు ఆసక్తికర సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’(The Raja Saab) ముందుగా జనవరి 9న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) జనవరి 12న.. మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) జనవరి 13న.. నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju), శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari) చిత్రాలు జనవరి 14న వరుసగా రిలీజ్ కానున్నాయి. ఇక ఈ చిత్రాల ప్రమోషన్స్‌ను ఆయా చిత్ర మేకర్స్ శరవేగంగా నిర్వహిస్తున్నారు.
అయితే, ఆసక్తికరంగా ఒకే రోజు మూడు చిత్రాలకు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్స్ జరగనుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ను జనవరి 7న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ఏఆర్‌టి సినిమాస్‌లో జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రిలీజ్ కానుంది.
రాత్రి 7 గంటలకు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇలా మూడు భారీ ఈవెంట్స్ ఒకేరోజు జరుగుతుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


