ఓవర్సీస్‌లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ర్యాంపేజ్.. ప్రీ-సేల్స్‌లో అప్పుడే ఆ మార్క్..!

ఓవర్సీస్‌లో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ర్యాంపేజ్.. ప్రీ-సేల్స్‌లో అప్పుడే ఆ మార్క్..!

Published on Jan 7, 2026 1:00 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ-సేల్స్‌లోనే ఈ సినిమా 200 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. దీనితో పాటు ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, డిస్ట్రిబ్యూటర్ మరిన్ని స్క్రీన్స్‌తో పాటు XD ఫార్మాట్ షోలను కూడా ఇవాళ్టి నుంచి యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా మార్కెట్ చిరంజీవి గారికి ఎప్పటినుంచో బలమైన ఏరియా కావడంతో, ఈ సినిమా అక్కడ భారీ ఓపెనింగ్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు