ముగ్గురు హీరోలు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారు!

ముగ్గురు హీరోలు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారు!

Published on Jul 9, 2018 11:17 PM IST

3herois

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల హావ కొనసాగుతుంది . ఈ తరహా చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు అగ్ర హీరోలు వెంకటేష్, నాగార్జున. ఇక వీరి తరువాత ఎక్కువగా యువ హీరోల్లో ఈ తరహా చిత్రాల్లో నారా రోహిత్ , శ్రీ విష్ణులు నటిస్తుంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరితో కలిసి మరో హీరో సుధీర్ బాబు అలాగే సీనియర్ హీరోయిన్ శ్రీయలు ఒక చిత్రంలో నటిస్తున్నారు.

నూతన దర్శకుడు ఇంద్రసేనా తెరకెక్కిస్తున్న చిత్రంలో వీళ్ళందరూ కలిసి నటిస్తున్నారు. బాబా క్రియేషన్స్ పతాకం ఫై బెల్లన అప్పారావు నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

తాజా వార్తలు