లైన్ లో ముగ్గురు ‘జబర్ధస్త్’ లాంటి హీరోలు

లైన్ లో ముగ్గురు ‘జబర్ధస్త్’ లాంటి హీరోలు

Published on Sep 18, 2019 10:20 AM IST

తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ కామెడీ షో తెలియనివారంటూ ఉండరంటే అతిశయోక్తికాదు. పిల్లలు,యూత్, పెద్దవారు అందరూ జబర్ధస్త్ అభిమానులే. అందుకే అత్యధిక టీఆర్పీ రేటింగ్ కలిగిన కామెడీ షోగా జబర్ధస్త్ దూసుకుపోతుంది. ఇక ఈ షోతో సామాన్యులుగా తమ కెరీర్ ని ప్రారంభించి అసామాన్యంగా ఎదిగారు కొందరు నటులు. వర్థమాన కమెడియన్స్ తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ ప్రోగ్రాం మంచి వేదికగా నిలిచింది.

ఇక ఈ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న నటులు సినిమాలలో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే షకలక శంకర్ హీరోగా వరుస చిత్రాలు చేస్తుండగా, ధన్రాజ్, చంటి, రాకెట్ రాఘవ, ఆది వంటివారు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ముగ్గురు జబర్ధస్త్ స్టార్స్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు.

సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట లు హీరోలుగా నటిస్తున్న చిత్రాలు త్వరలో రానున్నాయి. జబర్ధస్త్ హాట్ ఫేవరేట్ కమెడియన్స్ లో ఒకరైన సుధీర్ “సాఫ్ట్ వేర్ సుధీర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తుండగా, చమ్మక్ చంద్ర “రామసక్కనోళ్లు” మరియు మహేష్ అంచంట “నేను నా నాగార్జున” చిత్రాలతో హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు