ఆ ముగ్గురు టాలీవుడ్ ప్రముఖుల పుట్టినరోజు నేడే.

Published on May 20, 2019 1:16 pm IST

టాలీవుడ్ ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు ప్రముఖుల పుట్టినరోజులు జరుపుకుంటుంది. వారే జూనియర్ ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరియు మంచు మనోజ్. ఈ ముగ్గురు జన్మించిన తేదీ మే 20 అనగా ఈరోజు.

ఎన్టీఆర్ టాలీవడ్ లో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రత్యేకమైన నటన,అచ్చమైన డైలాగ్ డెలివరీ ,మెరుపు డాన్సులతో ఎన్టీఆర్ తిరుగులేని స్టార్గా ఎదిగారు. ఎన్టీఆర్ లో ఉన్నమరో టాలెంట్ సింగింగ్, ఇప్పటికే ఆయన తన మూవీస్ లో కొన్ని పాటలను స్వయంగా పాడారు. వరుసవిజయలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, “ఆర్ ఆర్ ఆర్ ” అనే ప్రతిష్టాత్మక ఫ్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.

కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 1986 వచ్చిన క్లాసిక్ ‘సిరివెన్నెల” మూవీకి తాను రాసిన సాహిత్యం సీతారామ శాస్త్రిగారికి ఎనలేని పేరుతెచ్చి పెట్టింది. ఆయన వచన సరళీ పాటలకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది. నేటి తరం సినిమా కవులకు సీతారామ శాస్త్రి పాటలు స్ఫూర్తి దాయకంగా ఉంటాయి.దశాబ్దాలుగా ఆయన వందల సినిమాలకు తన సాహిత్యం అందించారు.. నేటికీ అందిస్తూనే ఉన్నారు.

సినిమా కమర్షియల్ చట్రం లో ఇరుక్కోకుండా జయాపజయాలతో సంబంధం లేకుండా మూవీస్ చేసే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. విలక్షణ నటులు మోహన్ బాబు నటన వారసుడిగా తెరంగేట్రం చేసిన మనోజ్ వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. ఆయన నటించిన “వేదం”,”ప్రయాణం” “ఒక్కడు మిగిలాడు”వంటిమూవీస్ డిఫరెంట్ కథాంశాలలతో తెరకెక్కినవే.
ఈ ముగ్గురు సినీ ప్రముఖులకు 123తెలుగు తరుపున జన్మదిన శుభాకాంక్షలు

సంబంధిత సమాచారం :

More