స్పోర్ట్స్ డ్రామాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ !

స్పోర్ట్స్ డ్రామాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ !

Published on Jun 11, 2019 3:00 AM IST

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. ఈయ‌న త‌ర్వ‌లోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం అవుతుంది. మొదటి షెడ్యూల్ ఈ నెల చివరి వరకూ జరగనుంది. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. ఓ యువ‌కుడు అథ్లెట్‌ గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం.

కాగా స్పోర్ట్స్ డ్రామాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు