‘జులాయి’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు అల్లు అర్జున్ – వెన్నెల కిషోర్ – సురేఖ వాణిలపై కొన్ని కాండీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. వీరి ముగ్గురు కాంబినేషన్ విత్ త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే ఆడియన్స్ నవ్వుకోవడానికి కావాల్సినంత హాస్యం ఆ సీన్స్ లో ఉంటుందని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, ప్రణిత హీరోయిన్స్ గా ఆడిపాడనున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో బన్ని చేయడం ఇదే మొదటిసారి కావడంతో వీరి కాంబినేషన్ బాగుంటుందని ఆశిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి గట్టి పోటీనిచ్చే విలన్ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు. జులాయి సినిమా నిర్మించిన రాధాకృష్ణ హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


