ఉత్తమ విలన్ ప్రీమియర్ షోకి సూపర్బ్ టాక్.!

ఉత్తమ విలన్ ప్రీమియర్ షోకి సూపర్బ్ టాక్.!

Published on Apr 30, 2015 10:15 PM IST

Uttamavillain
ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన మరో ప్రయోగమే ‘ఉత్తమ విలన్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మే 1న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం గత కొద్ది రోజులుగా ఎంతో వినూత్నంగా పబ్లిసిటీ జరుగుతోంది. ఇది పక్కన పెడితే ఈ రోజు తమిళనాడులోని కొంతమంది ప్రముఖులకు ఈ సినిమాని స్పెషల్ గా ప్రీమియర్ వేసి చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రెండు విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ చూపించిన వైవిధ్యం చూసి ఎంతో థ్రిల్ అవ్వడమే కాకుండా సినిమా చాలా బాగుందని అంటున్నారు. అలాగే సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా కూడా ఉందని అంటున్నారు.

అలాగే బాలచందర్ గారిని చివరిసారిగా స్క్రీన్ పైన చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ గా ఫెలయ్యారట. రేపు ఆడియన్స్ కూడా ఇదే ఫీలింగ్ కి లోనవుతారనీ అంటున్నారు. ఈ రోజు రాత్రి దుబాయ్ లో మొదటి ప్రీమియర్ వేయనున్నారు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు