నవీన్ పొలిశెట్టి లక్కీ ఛాన్స్.. ‘అనగనగా ఒక రాజు’కి ఏపీలో టికెట్ రేట్ల పెంపు!

నవీన్ పొలిశెట్టి లక్కీ ఛాన్స్.. ‘అనగనగా ఒక రాజు’కి ఏపీలో టికెట్ రేట్ల పెంపు!

Published on Jan 10, 2026 8:00 PM IST

Anaganaga Oka Raju

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారి ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే, సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే బూస్ట్ ఇచ్చింది.

ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ రోజు.. అంటే జనవరి 14 నుంచి 10 రోజుల పాటు ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50/- మల్టీప్లెక్స్‌లలో రూ.75/- చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఇక ఈ బూస్ట్‌తో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
aaa

సంబంధిత సమాచారం

తాజా వార్తలు