
సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ – అందాల రాక్షసి ఫేం క్యూట్ హీరో రాహుల్ రవీంద్రన్ కలిసి చేసిన లేటెస్ట్ మూవీ ‘టైగర్’. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు విఐ ఆనంద్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమా జూన్ 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. దాంతో ఈ చిత్ర టీం ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ చిత్ర డైరెక్టర్ విఐ ఆనంద్ తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు.
ఆనంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో టైగర్ అనే పాత్రని సందీప్ కిషన్ పోషించాడు. నా జీవితంలో ఫేస్ చేసిన ఓ రియల్ లైఫ్ పాత్రలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చూసి ఆ పాత్రని రాసానని’ తెలిపాడు. స్నేహం – ప్రేమ అనే బావోద్వేగాలను ముఖ్య కథాంశంగా చేసుకొని తీసిన ఈ సినిమాని ఎక్కువ భాగం వారణాశిలో షూట్ చేసారు. ఈ సినిమాలో రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ – ఠాగూర్ మధు కలిసి నిర్మించారు.