స్టూవర్టుపురంలో గజదొంగ పరిస్థితి ఏమిటి ?

Published on Apr 22, 2019 1:20 pm IST

ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ ను నిర్మించాలని. ఇప్పటికీ కూడా ఆ బయోపిక్ ఎప్పుడు మొదలవుతుందో చిత్రబృందానికి కూడా క్లారిటీ లేనట్లుంది. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ బయోపిక్ ఈ నెలలో స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ కు సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చెయ్యబోతునట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలు కూడా ఫేక్ అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని కూడా ఆ మధ్య ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది. కానీ దాన్ని గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి స్టూవర్టుపురం గజదొంగ పరిస్థితి ఏమిటో ? ఎప్పుడు మొదలు అవుతుందో ?

ఇంతకీ ఎవరు ‘టైగర్ నాగేశ్వర్రావు’ అని అనుకుంటున్నారా.. ? ఇప్పటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి ఆయన బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి మరి.

సంబంధిత సమాచారం :