టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ కి సంబందించిన ప్రోమో ను నిన్న సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమో కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
టికెట్ ఏ కొనకుండా అంటూ సాగే పూర్తి పాట జులై 26 న రిలీజ్ కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 15, 2023 న రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


