మోస్ట్ అవైటెడ్ “ఆచార్య” టీజర్ కు డేట్, టైం లాక్.!

Published on Jan 27, 2021 10:07 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలానే అంచనాలు సెట్టయ్యాయి. మరి దీనితో పాటుగా ఈ సినిమా టీజర్ కోసం కూడా చాలా మందే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దీనిపైనే చిరు కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో అప్డేట్ ను కూడా ఇచ్చారు. మరి ఈ డిస్కషన్ లో భాగంగా ఎట్టకేలకు ఈ భారీ చిత్రం తాలుకా టీజర్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ను రివీల్ చేసేసారు. ఈ చిత్రం తాలూకా టీజర్ ను చిత్ర యూనిట్ వచ్చే జనవరి 29న విడుదల చెయ్యడానికి ఫిక్స్ చేశారు.

తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని టీజర్ పై అప్డేట్ ఇచ్చేసారు. చిరు మరియు కొరటాల మొదటి చిత్రం అలాగే మణిశర్మ చిరు నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న మ్యూజిక్ ఆల్బమ్ చరణ్ మరో కీలక పాత్ర పోషించడం వంటివి ఈ చిత్రం మరియు టీజర్ పై అంతకంతకు అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :