మాస్ మహారాజ్ ఫీస్ట్ అప్పుడు ఫిక్స్.?

Published on Aug 31, 2021 1:00 pm IST


మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పలు సాలిడ్ చిత్రాల షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిన చిత్రం “ఖిలాడి”. లాస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ చిత్రం “క్రాక్” తర్వాత వస్తున్న సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు కూడా దీనిపై నెలకొన్నాయి. దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో మరియు భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ సింగిల్ రెడీ అవుతుండగా ఈ చిత్రం రిలీజ్ కి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది దీవాళీ రేస్ లో నిలపాలని చూస్తున్నారట. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :