కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ‘బేబి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎస్కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్లో మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.
ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే ఈ ఎమోషనల్ జర్నీ ట్రైలర్‌ను జూలై 18న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
