మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు బాబీతో మళ్ళీ కాంబినేషన్ రీపీట్ అవుతూ, ‘మెగా 158’ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు మెగాస్టార్. ఇక ఈ సినిమాలో చిరుని మునుపెన్నడూ చూడని కొత్త కోణంలో చూపించేందుకు బాబీ సిద్ధమయ్యాడు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను రేపు(ఆగస్టు 22) ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో అభిమానుల మధ్య గ్రాండ్‌గా స్క్రీన్ చేయనున్నారు. ఈ స్పెషల్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాల్గొని సందడి చేయనున్నారు.
ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను పవర్‌ప్యాక్డ్‌గా జరుపుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.


