NBK111 : ‘కొత్త శకానికి నాంది’ పలికే టైమ్ ఫిక్స్ చేసిన బాలయ్య..!

NBK111 : ‘కొత్త శకానికి నాంది’ పలికే టైమ్ ఫిక్స్ చేసిన బాలయ్య..!

Published on Jun 9, 2026 6:32 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న జరుపుకుంటుండటంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నుంచి మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, వారు ఇచ్చే ఆ ట్రీట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ ట్రీట్‌కు మేకర్స్ తాజాగా టైమ్ ఫిక్స్ చేశారు.

NBK111 చిత్రం నుండి ‘ఒక కొత్త శకానికి నాంది’ అంటూ బాలయ్య ఎంట్రీ ఇచ్చే టైమ్ లాక్ చేశారు మేకర్స్. ఈ ట్రీట్‌ను జూన్ 10న సాయంత్రం 5.40 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రీ-లుక్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు.

‘నో మోర్ వింటేజ్.. ఓన్లీ న్యూ ఏజ్’ అంటూ ఈ సినిమాకు వారు ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మరి రేపు(జూన్ 10) ఈ చిత్రం నుండి రాబోయే ట్రీట్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు