‘ఇరుముడి’ గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే..?

‘ఇరుముడి’ గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే..?

Published on Jun 2, 2026 10:00 PM IST

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

‘ఇరుముడి’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను జూన్ 3న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను కూడా వారు రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో డివోషనల్ అంశం కూడా ఉండనుందని.. అయ్యప్పకు సంబంధించి ఓ సాలిడ్ రీమిక్స్ సాంగ్ కూడా ఉండబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ ఇప్పటికే రివీల్ చేశాడు. ఈ సినిమాలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు