వరల్డ్ వైడ్ గా మంచి హైప్ అండ్ రీచ్ ఉన్న పలు సెన్సేషనల్ హిట్ సిరీస్ లలో “స్ట్రేంజర్ థింగ్స్” కూడా ఒకటి. మరి ఎంతో పాపులారిటీ అందుకున్న ఈ సిరీస్ లో ఫైనల్ సీజన్ ని మేకర్స్ భాగాలుగా ప్లాన్ చేసి కొన్ని ఎపిసోడ్స్ చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇలా గత నవంబర్ లో వచ్చిన సీజన్ 5 తాలూకా పార్ట్ 1 నుంచి 4 ఎపిసోడ్స్ కి మాస్ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చింది.
అయితే ఈ సిరీస్ ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆయా డేట్స్, ఆయా సమయాల్లో వదులుతూ వస్తున్నారు. ఇలా సీజన్ 5 తాలూకా రెండో పార్ట్ ఇండియాలో ఎపుడు రిలీజ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ గ్లోబల్ రిలీజ్ టైం ని అనౌన్స్ చేశారు.
యునైటెడ్ స్టేట్స్ లో డిసెంబర్ 25న వరుసగా సాయంత్రం 5 గంటలు అలాగే 8 గంటల నుంచి ప్రీమియర్స్ పడనున్నాయని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ టైమింగ్ ప్రకారం మన దగ్గర ఈ సీజన్ డిసెంబర్ 26న తెల్లవారు 6 గంటల 30 నిమిషాలకు స్ట్రీమ్ కానుంది. లాస్ట్ పార్ట్ కూడా ఇలానే వచ్చిన సంగతి తెలిసిందే. సో అదే సమయంలో ఇది కూడా రానుంది.
Everything we have ever assumed about the Upside Down has been dead wrong.
Stranger Things 5 Vol. 2 premieres December 25 at 8PM ET / 5PM PT. pic.twitter.com/xRwG9w8Z0g
— Netflix (@netflix) December 15, 2025
