నిఖిల్ కొత్త చిత్రానికి ఇంట్రస్టింగ్ టైటిల్ !

నిఖిల్ కొత్త చిత్రానికి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Feb 4, 2019 11:59 AM IST

టి యెన్ సంతోష్ దర్శకత్వంలో యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం యొక్క టైటిల్, విడుదల తేదీ లను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ‘అర్జున్ సురవరం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈచిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్న నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. సోషల్ ఇష్యూస్ బేస్ చేసుకుని తెరకెక్కతుంది ఈ చిత్రం. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది.

సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు