మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. తన అనితర సాధ్యమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు తిరుగులేని సూపర్ స్టార్‌గా కొనసాగిన చిరంజీవి, రాజకీయాల్లోకి ప్రవేశించాక సినిమాలకు దూరమైపోయారు. అయితే ఆయన అభిమానులు మాత్రం చిరు సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా అభిమానుల కోసం చిరు 150వ సినిమాతో సిద్ధమైపోయిన విషయం ఈ ఉదయమే తెలియజేశాం.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. ఇక ఇప్పుడే అందిన సమాచారం మేరకు ఈ సినిమాకు ‘ఆటోజానీ’ అన్న పేరుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఔట్ అన్డ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది. గతంలో చిరు తనయుడు రామ్‌చరణ్‌ను వెండితెరకు పరిచయం చేసిన పూరీ, ఇప్పుడు చిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో మొదటి సినిమాకు దర్శకత్వం వహించడం విశేషంగా కనిపిస్తోంది.


