జయలలిత బయోపిక్ టైటిల్ ఖరారు !

Published on Feb 24, 2019 3:17 pm IST


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి’ పురిచ్చి తలైవి’ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ తెరకెక్కించనున్న ఒక బయోపిక్ ను తెరకెక్కంచనున్నారు. ఈ చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకం ఫై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈచిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే జయలలిత జీవితం ఆధారంగా లేడీ డైరెక్ట్ ప్రియదర్శిని మరో బయోపిక్ ను తెరకెక్కిస్తుంది. ది ఐరన్ లేడీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, అమ్మ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్టేజి లో వుంది.

సంబంధిత సమాచారం :