‘రంగస్థలం’ సక్సెస్ తరవాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. చరణ్, బోయపాటి కాంబినేషన్ మొదటిసారి కావడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై అమితమైన ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటికే అనేక పేర్లు వినిపించగా వాటిలో ఏదీ కూడ అఫీషియల్ టైటిల్ కాదని, నిర్మాతలు త్వరలోనే టైటిల్ ఏమిటనేది ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసిన యూనిట్ జూన్ 12నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవలే ‘భరత్ అనే నేను’తో భారీ విజయాన్ని అందుకున్న నిర్మాత డివివి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


