‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వివాదం సద్దుమణిగేనా ?

Published on May 25, 2021 7:01 pm IST

మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ విడుదలకు రెడీ అయింది. జూన్ 4వ తేదీన ఇది రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగా తమిళనాడులో మాత్రం వివాదాస్పదమైంది. ఈసారి కథను తమిళనాడులో సెట్ చేశారు దర్శకులు రాజ్ అండ్ డీకే. అంతేకాదు ముఖ్యమైన నెగెటివ్ పాత్రను కూడ తమిళ నేపథ్యం నుండే తీసుకున్నారు. ఈ పాత్రను సమంత అక్కినేని పోషిస్తోంది. సమంత చేస్తున్న పాత్ర ఒక రెబల్ క్యారెక్టర్.

ట్రైలర్లో ఆమె పాత్రకు ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు చూపించారని, తమిళ ఈలం ప్రస్తావన కూడ ఉందన్నట్టు కంటెంట్ ఉందని, ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లేఖ రాసింది. వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని ఎం.డి.ఎం.కె జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వైగో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజ్ అండ్ డీకే మాత్రం ట్రైలర్ చూసి ఇలా అపోహలు పెంచుకోవడం సరికాదని, వెబ్ సిరీస్లో తమిళులను కించపరిచే సన్నివేశాలేవీ లేవని అంటున్నారు. మరి రిలీజ్ నాటికి ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :