రానా ఎంగేజ్మెంట్ రోజు ఈరోజే.!

రానా ఎంగేజ్మెంట్ రోజు ఈరోజే.!

Published on May 20, 2020 1:53 PM IST


టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి గత కొన్ని రోజుల క్రితమే తన ప్రేమ వ్యవహారాన్ని ఓపెన్ గా చెప్పి టాలీవుడ్ సహా అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చారు. కొంత కాలంగా మిహిక బజాజ్ తో ప్రేమలో ఉన్న రానా ఫైనల్ గా ఇప్పుడు ఓకే చేసారు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.తమ ఇద్దరి ప్రేమను ఇరు వైపులా కుటుంబీకులు అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది.

అయితే ఇప్పుడు మరో సర్ప్రైజ్ ను అందించారు. ఈ సర్ప్రైజ్ ఏంటంటే వీరిద్దరూ మొదటిగా ఎక్కడైతే ఒకరినొకరు చూసుకున్నారో అక్కడే అందులోనూ ఈరోజే రానా మిహికా ల నిశ్చితార్ధం జరగబోతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇరు జంటల కుటుంబీకుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో జరగనుంది.మరి వీరి వివాహ వేడుక కబురు కూడా రానా ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు