యేసు క్రీస్తు జీవితం ఆధారంగా ‘తొలి కిరణం’

యేసు క్రీస్తు జీవితం ఆధారంగా ‘తొలి కిరణం’

Published on Sep 7, 2015 12:00 PM IST

tholikiranam
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై యేసు క్రీస్తు జీవిత గాధను ఆధారంగా చేసుకొని టి.సుధాకర్ నిర్మిస్తోన్న సినిమా ‘తొలి కిరణం’. జె. జాన్‌బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు టి.ఎ. ప్రభు కిరణ్ మాటలు అందించారు. ఇప్పటికే అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో యేసు ప్రభువుగా సీనియర్ నటుడు పి.డి. రాజు నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ.పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక సినిమా లాంచ్ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. జీసస్ కథతో రూపొందుతోన్న సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈనెల 15నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నామని దర్శకుడు ఈసందర్భంగా తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఇజ్రాయెల్, గోవా తదితర ప్రాంతాల్లో జరిగే షూటింగ్ జరగనుంది. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశామని నిర్మాత తెలిపారు. మురళీ కృష్ణ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, వినయ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు