ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ దిగ్గజాలు..మహేష్ కి చిరు స్పెషల్ విషెష్!

Published on Feb 10, 2022 12:53 pm IST

ఈరోజు మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ బిగ్ స్టార్స్ కొందరు గత కొంత కాలం నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్య టికెట్ ధరలు కోసం మరియు ఇతర మరికొన్ని సమస్యల నిమిత్తం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరకి వెళ్ళడానికి నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ లిస్ట్ లో మొదటగా టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కి సీఎం నుంచి పిలుపు రాగా తర్వాత తనతో పాటుగా మరికొంత మంది హీరోలు మరియు దర్శక నిర్మాతలు వెళ్ళడానికి రెడీ అయ్యారు మరి వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సహా దిగ్గజ దర్శకుడు రాజమౌళి మరియు కొరటాల శివలు అంతా ఒక చార్టెడ్ ఫ్లైట్ లో పయనమయ్యారు.

మరి ఈ ప్రయాణంలో ఒక అదిరే మూమెంట్ చోటు చేసుకుంది అని చెప్పాలి. ఈరోజు మహేష్ బాబు 17వ పెళ్లి రోజు సందర్భంగా మెగాస్టార్ చిరు మహేష్ కి ఒక పుష్ప గుచ్ఛం ఇచ్చి తన ప్రత్యేక అభినందననాలు తెలియజేసారు. మరి ఈ ఫొటోలో చిరు మహేష్ లతో పాటు మిగతా సినీ తారలు కూడా ఫోజ్ ఇచ్చారు. దీనితో ఈ దిగ్గజాలు అందరు కనిపించిన ఈ ఫోటో మరింత స్పెషల్ గా మారిపోయి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :