ఆ ఒక్క పాయింట్ తో ‘ఆమె’ చిత్రం అందరిని ఆకర్షిస్తోంది

Published on Jul 17, 2019 10:18 am IST

నటి అమలా పాల్ తెలుగులో అతి తక్కువ చిత్రాలలో నటించారు. చరణ్ సరసన ‘నాయక్’,నాని హీరోగా వచ్చిన ‘జెండా పై కపిరాజు’ ఇలా కొన్ని చిత్రాలలో కనిపించినా ఆమెకు తెలుగులో అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఐతే ఆమె నటించిన తాజా చిత్రం “ఆమె” మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ చిత్రంలో అమలా పాల్ ఓ సన్నివేశంలో బట్టలు లేకుండా నటించారు. సస్పెన్సు థ్రిలర్ గా తెరకెక్కిన “ఆడై” చిత్రాన్ని తెలుగులో “ఆమె” గా విడుదల చేస్తున్నారు.

సినిమా మొదలైనప్పటినుండి ఎటువంటి ఆర్బాటం లేని ఈ మూవీకి టీజర్ తరువాత ఒక్కసారిగా విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఆ టీజర్ లో అమలా పాల్ అసలు బట్టలేమి లేకుండా న్యూడ్ గా కనిపించారు. దానితో అందరూ ఈ చిత్రం గురించి అందరు మాట్లాడుకోవడం మొదలైంది. అమలా పాల్ గత చిత్రాలను గమనిస్తే ఆమె మోతాదుకు మంచి ఎక్స్ పోసింగ్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటి అమలా పాల్ ఒక్కసారిగా షాక్ ఇస్తూ న్యూడ్ గా నటించడం అందరిని విస్మయానికి గురిచేసింది. ఈ సన్నివేశం కోసం అమలా పాల్ కొన్ని రోజుల తరబడి బట్టలు లేకుండా నటించాల్సి వచ్చిందట.

ఏది ఏమైనా తెలుగులో అంతగా గుర్తింపు లేని ఈ నటి సినిమాలోని ఆఒక్క పాయింట్ తో తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రం పై ఆసక్తికనపరిచేలా చేసింది. వి స్టూడియోస్ బ్యానర్ పై వి రత్న కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 19న విడుదల తెలుగు,తమిళ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :