రంజాన్ సమయం వచ్చిన తరుణంలో ఎక్కడ చూసినా హలీమ్ సందడి నెలకొంది. హైదరాబాద్ నగరమంతా కొన్ని వందల సంఖ్యలో హలీమ్ షాప్ లు నెలకొన్నాయి. రాత్రి సమయంతో సంబంధం లేకుండా ఈ హలీమ్ ని ఆస్వాదించే భోజన ప్రియులు ఎక్కువయ్యారు.
టాలీవుడ్ లో అగ్ర నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రవితేజ మరియు పూరి జగన్ ఈ హలీమ్ కు పెద్ద ఫ్యాన్స్. హీరోయిన్లలో సమంతకి హలీమ్ అంటే పిచ్చి.
వీరేకాక యువ నాయకులు, టెక్నీషియన్ లు ఈ హలీమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తినకపోతే మీరు కూడా ఎంజాయ్ చేయండి.


