రేపటి నుంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి..!

రేపటి నుంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి..!

Published on May 21, 2020 2:02 PM IST

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ మోహన్ రావు లతో పాటు నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్,సురేష్ బాబు, సి.కళ్యాణ్,దిల్ రాజు, జెమిని కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, వ్.వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్. శంకర్, కొరటాల శివ తదితరులతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన అనిచ్చిత పరిస్థితులు మరియు సాధరణ వాతావరణం ఎలా తీసుకురావాలి వంటి విషయాలు చర్చించారు.

దానిలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ… సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం, థియేటర్స్, సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలు లేవనత్తారు. ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయింది. దీనివలన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు, అన్నారు.

దర్శకుడు రాజమౌళి, హీరో నాగార్జున ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ కి కొన్ని విన్నపాలు చేసినట్లు తెలుస్తుంది. ప్రముఖులు చెప్పిన విషయాలు విన్న తలసాని శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ వృద్ధికి కావలసిన అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు. విజ్ఞప్తులు సేకరించిన తలసాని సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం అన్నారు.

ఇక రేపటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. మిగతా కార్యాచరణపై కూడా ఓ నివేదిక తయారు చేసి, రెండు రోజులలో ఇండస్ట్రీ పెద్దలు సీఎం కే సి ఆర్ ని కలవనున్నారు. అలాగే పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్స్ అనుమతి వంటి విషయాలు ఆయనతో చర్చించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు