కేసీఆర్ తో భేటీ కానున్న చిత్ర ప్రముఖులు.

Published on May 22, 2020 3:59 pm IST

కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. దీని నుండి బయటపడే మార్గాలను టాలీవుడ్ ప్రముఖులు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వాధి నేతలతో చిత్ర ప్రముఖులు సమావేశం అవుతున్నారు.

కాగా కొద్ది సేపట్లో..లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలవనున్న సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి,త్రివిక్రమ్, ఎన్. శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సి. కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేష్, ప్రవీణ్ బాబు తదితరులు

సంబంధిత సమాచారం :

X
More